Varla Ramaiah: విచారణకు హాజరై తోటి ముద్దాయిలకు ఆదర్శంగా నిలవండి: వ‌ర్ల రామ‌య్య

varlaramaiah slams jagan
  • ముఖ్యమంత్రి గారూ.. క్రమం తప్పకుండా కోర్టుకు హాజరుకావాలి
  • విచారణ త్వరితగతిన ముగించడానికి సహకరించాలి
  • పదేపదే  గైర్హాజరై, సభ్య సమాజానికి ఏం సందేశమిస్తున్నారు?

కోర్టుల‌కు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రుకావాలంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు టీడీపీ నేత‌ వ‌ర్ల రామ‌య్య సలహా ఇచ్చారు. విచార‌ణ త్వ‌ర‌గా పూర్త‌య్యేందుకు స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు.

'ముఖ్యమంత్రి గారూ! తోటి ముద్దాయిలకు ఆదర్శంగా నిలుస్తూ, క్రమం తప్పకుండా కోర్టుకు హాజరై, మీ కేసుల విచారణ త్వరితగతిన ముగించడానికి సహకరించవలసిన మీరు పదేపదే గైర్హాజరై, సభ్య సమాజానికి ఏం సందేశమిస్తున్నారు? ఓ సారి ఆలోచించండి. క్రమం తప్పకుండా కోర్టుల విచారణకు హాజరై, తోటి ముద్దాయిలకు ఆదర్శంగా నిలవండి' అంటూ వ‌ర్ల రామ‌య్య పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News