NEET Exam: నీట్ పరీక్ష నేపథ్యంలో.. కువైట్ లోని భారత ఎంబసీ కీలక నిర్ణయం!

Indian Embassy in Kuwai stops all services for two days
  • ఈ నెల 12న నీట్ పరీక్ష
  • తొలిసారి దేశానికి వెలుపల కువైట్ లో కూడా పరీక్ష నిర్వహణ
  • ఈ నెల 9, 12 తేదీల్లో అన్ని సర్వీసులను నిలిపివేసిన రాయబార కార్యాలయం
నీట్-2021 పరీక్షల నేపథ్యంలో కువైట్ లోని భారత రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9, 12 తేదీల్లోని అన్ని పబ్లిక్ సర్వీసులను క్యాన్సిల్ చేసినట్టు ప్రకటించింది. అయితే, ఈ రెండు రోజుల పాటు ఎమర్జెన్సీ కాన్సులర్ సర్వీసులు మాత్రం ఉంటాయని తెలిపింది.

ఈనెల 12న నీట్ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడాది దేశం వెలుపల కూడా తొలిసారిగా ఈ పరీక్షను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ అవకాశాన్ని కువైట్ కు కేటాయించింది. దీంతో, అక్కడ నివసిస్తున్న భారతీయ విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది.

కరోనా నేపథ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉన్న తరుణంలో, ఇండియాకు వచ్చి నీట్ పరీక్ష రాయడం ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు కువైట్ లో పరీక్షను నిర్వహించనుండటం వల్ల అక్కడి విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. కువైట్ లో ఉన్న భారత విద్యార్థులు అక్కడే నీట్ పరీక్ష రాసే వెసులుబాటు కలిగింది. భారత ప్రభుత్వ నిర్ణయం పట్ల మన విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NEET Exam
Kuwait
Embassy

More Telugu News