VV Lakshminarayana: బైక్ పై అరటిగెలలతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ... పొటోలు ఇవిగో!

CBI former JD Lakshminarayana visits Ravulapalem market yard
  • తూర్పుగోదావరి జిల్లాలో లక్ష్మీనారాయణ పర్యటన
  • రావులపాలెం మార్కెట్ యార్డు సందర్శన
  • రైతులతో మాట్లాడిన వైనం
  • కూలీలు, హమాలీలతోనూ ముచ్చట్లు
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పదవీవిరమణ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించడం తెలిసిందే. జనసేన పార్టీలో చేరిన ఆయన కొన్నాళ్లకే ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి రైతుల సమస్యలపై దృష్టి సారించారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు.

తాజాగా ఆయన జిల్లాలోని రావులపాలెం మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా స్వయంగా బైక్ పై అరటిగెలలను తరలించారు. రైతులతో మాట్లాడి అరటి సాగులో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో కూలీలు, హమాలీలు, రవాణాదారులతోనూ లక్ష్మీనారాయణ ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
VV Lakshminarayana
Ravulapalem
Market Yard
East Godavari District

More Telugu News