జీవో 217పై అపోహలు సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది: ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు

06-09-2021 Mon 19:14
  • ఏపీలో జీవో 217 రగడ
  • మత్స్యకారుల పొట్టకొట్టేలా ఉందన్న టీడీపీ
  • స్పందించిన మంత్రి అప్పలరాజు
  • మత్స్యకారుల కోసం కృషి చేస్తున్నట్టు వెల్లడి
Minister Appalaraju counter TDP comments

సీఎం జగన్ తీసుకువచ్చిన జీవో 217 మత్స్యకారులను దెబ్బతీసేలా ఉందని టీడీపీ విమర్శిస్తుండడం పట్ల మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. జీవో 217పై అపోహలు సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ప్రతి జిల్లాలో ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు. స్థానిక మత్స్యకారులకు 582 చెరువులు లీజుకు ఇచ్చామని తెలిపారు. 28 జలాశయాల్లో ఫిషింగ్ లైసెన్సులు జారీ చేశామని పేర్కొన్నారు. మత్స్యకారుల ఆదాయం పెంచడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు. అందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని చెప్పారు.