KCR: కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన సీఎం కేసీఆర్

  • ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి
  • 5 అంశాలపై లేఖల అందజేత
  • రాష్ట్రంలో 1,138 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి వినతి
CM kcr meets central minister nitin gadkari

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఈరోజు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన 5 అంశాలపై లేఖలు అందించారు. విజయవాడ-హైదరాబాద్ హైవేను 6 లేన్లుగా విస్తరించాలని కోరారు.

అదే విధంగా కల్వకుర్తి-హైదరాబాద్ రహదారిని 4 లేన్లుగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే శ్రీశైలం రహదారిని కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,138 కిలోమీటర్ల మేర రహదారులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. రీజినల్ రింగ్‌రోడ్ నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రిని కేసీఆర్ అడిగారు. వీటన్నింటిపైనా కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News