'మాస్ట్రో' నుంచి లిరికల్ వీడియో రిలీజ్!

06-09-2021 Mon 18:24
  • నితిన్ నుంచి రానున్న 'మాస్ట్రో'
  • డిస్నీ హాట్ స్టార్ కి స్ట్రీమింగ్ హక్కులు
  • ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్
  • కీలక పాత్రలో తమన్నా  
Maestro lyrical video released
నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మాస్ట్రో' సినిమా రూపొందింది. ఆ మధ్య హిందీలో వచ్చిన 'అంధదూన్' సినిమాకి ఇది రీమేక్. కథానాయికగా నభా నటేశ్ నటించగా, హిందీలో 'టబు' పోషించిన కీలకమైన పాత్రలో తమన్నా కనిపించనుంది. డిస్నీ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. "హార్టెమో కొట్టుకుంది గోడకి .. వేలాడుతున్నా గడియారంలా .. " అంటూ ఈ పాట సాగుతోంది. మహతి స్వరసాగర్ కట్టిన ఈ బాణీ కొత్తగా అనిపిస్తోంది. కథలో సందర్భానుసారం వచ్చినప్పుడు ఈ పాట ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువ.

కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, ధనుంజయ్ ఆలపించాడు. నికిత రెడ్డి - సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. ఈ ఏడాది నితిన్ చేసిన 'చెక్' .. 'రంగ్ దే' థియేటర్లకు రాగా, 'మాస్ట్రో' డిస్నీ హాట్ స్టార్ లో రానుంది. ఈ సినిమాపై నితిన్ బలమైన నమ్మకంతో ఉన్నాడు.