Varavara Rao: వరవరరావు బెయిల్ ను పొడిగించిన బాంబే హైకోర్టు

  • ఎల్గార్ పరిషద్ కేసులో బెయిల్ పొడిగింపు
  • తెలంగాణకు వెళ్లేందుకు అనుమతించాలన్న పిటిషన్ 24కు వాయిదా
  • బెయిల్ షరతుల్లో సడలింపు లభించే అవకాశం ఉందన్న వరవరరావు
Bombay High Court extends bail to Varavara Rao

విరసం నేత, ప్రముఖ రచయిత వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్ ను మరోసారి పొడిగించింది. ఎల్గార్ పరిషద్ కేసులో తనకు మంజూరు చేసిన బెయిల్ ను పొడిగించాలంటూ ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. అయితే, తెలంగాణలోని తన ఇంటికి వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలని ఆయన పెట్టుకున్న పిటిషన్ పై విచారణను ఈనెల 24కు కోర్టు వాయిదా వేసింది.

ఈ నెల 24 వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. అంతవరకు (24 వరకు) ముంబైలోనే ఉండాలని పేర్కొంది. వరవరరావుకు ఇంతకు ముందు బెయిల్ ఇచ్చే సమయంలో... ముంబైలోనే ఉండాలంటూ హైకోర్టు షరతు విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన ముంబైలోనే ఉంటున్నారు. తాజా పిటిషన్ లో కోర్టు షరతులను తాను ఉల్లంఘించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ షరతుల్లో కొంత సడలింపును పొందే అవకాశం తనకు ఉందని వరవరరావు తెలిపారు.

More Telugu News