MAA: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల అధికారిగా హైకోర్టు అడ్వకేట్ నియామకం!

krishna mohan appoints as maa election  officer
  • అక్టోబరు 10న ఎన్నిక‌లు
  • ఎన్నికల‌ అధికారిగా అడ్వకేట్‌ కృష్ణ మోహన్
  • జీవీ నారాయణరావు స‌హాయ‌క ఎన్నిక‌ల అధికారి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబరు 10న నిర్వహించబోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల అధికారిగా హైకోర్టు అడ్వకేట్‌ కృష్ణమోహన్ ను నియమిస్తూ.. 'మా’ అధ్యక్షుడు నరేశ్‌ నిర్ణయం తీసుకున్నారు. బైలాస్‌ ప్రకారం ఎన్నికల అధికారిని నియమించే అధికారం మా అధ్యక్షుడికి ఉంటుంది. జీవీ నారాయణరావును స‌హాయ‌క ఎన్నిక‌ల అధికారిగా నియమించారు.

అలాగే, అక్టోబ‌రులో మా క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌ కృష్ణంరాజు భారత్‌లో ఉండడం లేదు. దీంతో ఎన్నికల బాధ్యతలు నిర్వహించడానికి పి.శివకృష్ణను నియమించారు. మా ఎన్నిక‌ల‌ అధికారిని నియమించి, ఎన్నిక‌ల‌కు నోటిఫికేషన్‌ విడుదలయ్యాక 'మా'కు సంబంధించిన రోజువారీ వ్యవహారాలతో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పూర్తి బాధ్యత అంతా ఎన్నికల అధికారి ప‌రిధిలోకే వెళుతుంది.
MAA
naresh

More Telugu News