Guinea: ఆఫ్రికా దేశంలో సైనిక తిరుగుబాటు.. సైన్యం నిర్బంధంలో అధ్యక్షుడు

Army coup in Guinea
  • గినియా దేశంలో సైనిక తిరుగుబాటు
  • రాజ్యాంగాన్ని రద్దు చేసినట్టు ప్రకటించిన సైన్యం
  • సైనిక తిరుగుబాటుని తప్పుపట్టిన అమెరికా
ఆఫ్రికాలోని గినియా దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది. గినియా దేశాధ్యక్షుడు అల్ఫా కోంటేని సైనికులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ఆర్మీ కల్నల్ మామాడి డౌంబౌయా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రద్దు చేసినట్టు తెలిపారు. ప్రజారంజకమైన పాలనను అందిస్తామని చెప్పారు. ఈరోజు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరోవైపు సైనిక తిరుగుబాటుని అమెరికా తప్పుపట్టింది. ప్రజాస్వామ్యానికి ఇది విరుద్ధమని వ్యాఖ్యానించింది.
Guinea
Army Coup
President

More Telugu News