'మహా సముద్రం' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ!

06-09-2021 Mon 11:39
  • విడుదలకి ముస్తాబైన 'మహాసముద్రం'
  • లవ్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే కథ
  • సంగీత దర్శకుడిగా చైతన్ భరద్వాజ్
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
Mahasamudram lyrical video release
అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' రూపొందింది. శర్వానంద్ ... సిద్ధార్థ్ .. అదితీరావు .. అనూ ఇమ్మాన్యుయేల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, జగపతిబాబు ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా, అక్టోబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
   
తాజాగా రష్మిక చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయించారు. "చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు .. " అంటూ ఈ పాట సాగుతోంది. ప్రేమలో పడిన ఒక యువతి మనసు చేసే అల్లరి ఈ పాట .. అతనితో అందమైన జీవితాన్ని ఊహిస్తూ ఉత్సాహంతో పాడుకునే పాట. తేలికైన పదాలతో చైతన్యప్రసాద్ అందించిన సాహిత్యం బాగుంది.

చైతన్ భరద్వాజ్ సంగీతం ..  దీప్తి పార్థసారథి ఆలాపన ఆకట్టుకుంటున్నాయి. పాటకు ... పాటకి సంబంధించిన మేకింగ్ షాట్స్ ను జోడిస్తూ అందించిన తీరు ఆకట్టుకుంటోంది. కెమెరా పనితనం బాగుందనే విషయం అర్థమవుతోంది. 'ఆర్ ఎక్స్ 100' సినిమా తరువాత అజయ్ భూపతి నుంచి వస్తున్న సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు ఉన్నాయి.