Saira Banu: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైరా బాను

Veteran actress Saira Banu discharged from hospital
  • శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడ్డ సైరా బాను
  • గత నెల 28న ఆసుపత్రిలో చేరిక
  • ఈ జులైలో ఆమె భర్త దిలీప్ కుమార్ మృతి
బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి సైరా బాను ముంబైలోని హిందుజా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత నెల 28న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు హై బీపీ, హై షుగర్ వంటి సమస్యలతో ఆమె ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయాన్ని వారి కుటుంబ స్నేహితుడు ఫైసల్ ఫరూఖీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సైరా బాను ఇంటికి వచ్చేశారని... ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుందని చెప్పారు.

ఆసుపత్రిలో చేరిన మూడు రోజుల తర్వాత సైరా బానును వైద్యులు ఐసీయూకి తరలించారు. ఆమె పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆమె వయసు 77 సంవత్సరాలు. బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ సతీమణే సైరా బాను అనే విషయం తెలిసిందే. ఈ ఏడాది జులైలో 98 ఏళ్ల వయసులో దిలీప్ కుమార్ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. వీరిద్దరూ కలిసి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అందమైన జంటగా వీరు గుర్తింపును తెచ్చుకున్నారు.
Saira Banu
Health
Bollywood
Deleep Kumar

More Telugu News