Kamal Chandra Bhanj Dev: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కాకతీయ వంశంలోని 22వ తరం వారసుడు

22nd generation descendant of the Kakatiya dynasty Kamal Chandra Bhanj Dev visits tirumala
  • కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్న కమల్‌చంద్ర
  • తీర్థ ప్రసాదాలు అందజేసిన టీటీడీ ఈవో
  • కష్టకాలం నుంచి ప్రజలను బయటపడేయాలని వేడుకున్నానన్న కమల్‌చంద్ర
కాకతీయ వంశంలో 22వ తరం వారసుడైన కమల్‌చంద్ర భంజ్‌దేవ్ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి తీర్థప్రసాదాలు అందించారు. ప్రస్తుత కష్టకాలం నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని స్వామి వారిని వేడుకున్నట్టు కమల్‌చంద్ర తెలిపారు.

Kamal Chandra Bhanj Dev
Kakatiya Dynasty
TTD

More Telugu News