Harish Rao: నన్ను తిట్టడం కాదు... కేంద్రంతో మాట్లాడి రైతు చట్టాలను రద్దు చేయించు: ఈటలకు స్పష్టం చేసిన హరీశ్ రావు

  • త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక
  • హరీశ్ రావు, ఈటల మధ్య మాటల యుద్ధం
  • జమ్మికుంటలో హరీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • ఓట్లు అడిగే హక్కు తమకే ఉందని స్పష్టీకరణ
Harish Rao comments on Eatala

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు, బీజేపీ నేత ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పరస్పర విమర్శలతో వాతావరణం వేడెక్కింది. తాజాగా జమ్మికుంటలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటల తనను తిట్టే బదులు, చేతనైతే కేంద్రంతో మాట్లాడి రైతు చట్టాలను రద్దు చేయించాలని అన్నారు.

బీజేపీ తెచ్చిన రైతు చట్టాలను నల్ల చట్టాలని గతంలో ఈటల అన్నారని హరీశ్ గుర్తు చేశారు. పైగా ఆ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడతానని కూడా చెప్పారని వెల్లడించారు. రైతులను ఓట్లు అడిగే హక్కు తమకే ఉందని హరీశ్ రావు స్పష్టం చేశారు. బీజేపీ నేతలు హుజూరాబాద్ లో అడుగుపెట్టాలంటే ముందు రైతు చట్టాలు రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే ఓట్లు అడగాలని సూచించారు.

More Telugu News