Team India: నాలుగో టెస్టులో పట్టుబిగిస్తున్న భారత్... 200 దాటిన ఆధిక్యం

Team India lead crossed two hundred mark in fourth test
  • నాలుగోరోజు ఆట ప్రారంభం
  • తొలి సెషన్ లో రెండు వికెట్లు కోల్పోయిన భారత్
  • జడేజా, రహానే అవుట్
  • క్రీజులో విరాట్ కోహ్లీ, పంత్
లండన్ లోని కెన్నింగ్ టన్ ఓవల్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 200 దాటింది. ఆటకు ఇవాళ నాలుగోరోజు కాగా తొలి సెషన్ లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా (17), అజింక్యా రహానే (0)లను ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో భారత్ స్కోరు 109 ఓవర్లలో 5 వికెట్లకు 304 పరుగులు కాగా, ఆధిక్యం 205 పరుగులకు చేరింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (44 బ్యాటింగ్), రిషబ్ పంత్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 191 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 290 పరుగులు చేసింది.
Team India
England
Fourth Test
London

More Telugu News