Padma Reddy: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సొంత పార్టీకి చెందిన మహిళా నేత ఫిర్యాదు

TRS leader Padma Reddy complaints police against Bellampally MLA Durgam Chinnaiah
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై పోలీసులను ఆశ్రయించిన పద్మారెడ్డి
  • చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపణ
  • అక్రమాలపై ఫిర్యాదు చేశామని కక్షగట్టారని వెల్లడి
  • తమకు ప్రాణహాని ఉందంటూ ఆందోళన
టీఆర్ఎస్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై టీఆర్ఎస్ మహిళా నేత పద్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో పాటు, తన కుమారులను కూడా చంపుతానంటూ ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించారని, ఇష్టంవచ్చినట్టు దూషించారని పద్మారెడ్డి ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

బెల్లంపల్లి మున్సిపాలిటీలో అక్రమాలపై మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేసినందుకే ఎమ్మెల్యే తమపై కక్ష పెంచుకున్నారని పద్మారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఆమె మంచిర్యాల ఏసీపీని కోరారు.
Padma Reddy
Durgma Chinnaiah
TRS
Police
Bellampally
Telangana

More Telugu News