Raghu Rama Krishna Raju: విజయసాయిరెడ్డిపై వచ్చే ఫిర్యాదుల కోసం ఓ టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయాలి: రఘురామకృష్ణరాజు

Raghurama Krishnaraju comments on Vijayasai Reddy
  • విజయసాయిపై ఫిర్యాదులు వస్తున్నాయన్న రఘురామ
  • కబ్జా చేశారంటూ కాల్స్ వస్తున్నట్టు వెల్లడి
  • ఎన్నారైలు జాగ్రత్తగా ఉండాలని సూచన
  • పారదర్శక విచారణ జరపాలంటూ డిమాండ్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్రస్థాయిలో ఫిర్యాదులు వస్తున్నాయని నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు వెల్లడించారు. విశాఖలో వంద కోట్ల విలువైన భూమిని ఆక్రమించారంటూ తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. విశాఖలో స్థలాలు కలిగిన ఎన్నారైలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విజయసాయిరెడ్డిపై లెక్కకుమిక్కిలిగా వస్తున్న ఫిర్యాదుల స్వీకరణకు ఒక టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయాలని వ్యంగ్యం ప్రదర్శించారు.

ఇటీవల విజయసాయి స్పందిస్తూ తన పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నవారిపై ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేయాలని సూచించారు. దీనిపై రఘురామ పైవిధంగా స్పందించారు. విజయసాయిపై వచ్చే ఫిర్యాదులను పారదర్శకరీతిలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అసలు, విజయసాయిని ముఖ్యమంత్రి ఎందుకు నియంత్రించడంలేదని ప్రశ్నించారు.
Raghu Rama Krishna Raju
Vijayasai Reddy
Visakhapatnam
YSRCP
Andhra Pradesh

More Telugu News