Krishna Nagar: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. కృష్ణా నాగర్ సంచలనం

  • భారత్‌కు నేడు వరుసగా రెండో పతకం
  • 19 పతకాలతో 24వ స్థానంలో భారత్
  • హాంకాంగ్ షట్లర్‌ను చిత్తు చేసిన కృష్ణా నాగర్
 Krishna Nagar Wins Indias 5th Gold

టోక్యో పారాలింపిక్స్ చివరి రోజు భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో భారత షట్లర్ సుహాస్ యతిరాజ్ ఈ ఉదయం రజత పతకం గెలుచుకోగా, తాజాగా మరో షట్లర్ కృష్ణా నాగర్ దేశానికి మరో స్వర్ణ పతకం అందించాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగం ఎస్‌హెచ్ 6లో హాంకాంగ్ క్రీడాకారుడు చు మన్‌కైతో జరిగిన పోరులో 21-17, 16-21, 21-17తో విజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఇది రెండో స్వర్ణ పతకం కావడం గమనార్హం. నిన్న స్టార్ షట్లర్ ప్రమోద్ భగత్ పారా-బ్యాడ్మింటన్‌లో తొలి పతకం అందించాడు. తాజా పతకంతో కలిపి భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 19కు పెరిగింది. వీటిలో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్‌ ప్రస్తుతం 24వ స్థానంలో ఉంది.

More Telugu News