Tollywood: శరణ్ కుమార్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన చిత్ర యూనిట్

First glimpse released on Hero Saran Kumar Birthday
  • సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో
  • శివ కేశర కుర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా
  • శరణ్ కుమార్ బర్త్‌డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్
టాలీవుడ్ కౌబాయ్, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో శరణ్ కుమార్. ఆయన హీరోగా ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 3గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. సుధాకర్ రెడ్డి నిర్మాత కాగా, శివ కేశర కుర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

శనివారం నాడు హీరో శరణ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేశారు. ఆవిరి పట్టిన అద్దాన్ని తుడిస్తే అందులో హీరో శరణ్ కుమార్ కనిపించేలా విభిన్నంగా దీన్ని డిజైన్ చేశారు. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేశారు. దీనికి చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన గ్లింప్స్ కూడా సినీ ప్రియులను ఆకర్షిస్తోంది.

గ్లింప్స్ విడుదల సందర్భంగా నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. శరణ్ కుమార్ జన్మదినం సందర్భంగా గ్లింప్స్ విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా వస్తున్న శరణ్ కుమార్‌కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని చెప్పారు. చిత్రానికి సంబంధించి త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ ఇస్తామన్నారు.
Tollywood
Saran Kumar

More Telugu News