తెలంగాణ ప్రభుత్వం ఈసీకి తప్పుడు నివేదిక పంపింది: బీజేపీ నేత జితేందర్ రెడ్డి
- పండగల సీజన్ తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నిక
- ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ ఓడిపోతుందన్న జితేందర్ రెడ్డి
- అందుకే వాయిదా వేయించారని ఆరోపణ
దీనిపై తెలంగాణ బీజేపీ నేత జితేందర్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఈసీకి తప్పుడు నివేదిక పంపిందని ఆరోపించారు. హుజూరాబాద్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్ కు నిఘా వర్గాల నుంచి నివేదిక అందిందని అన్నారు. తప్పుడు నివేదికల ద్వారా తెలంగాణ ప్రభుత్వం హుజూరాబాద్ ఉప ఎన్నికను వాయిదా వేయించిందని మండిపడ్డారు.