వివేకా హత్యకేసులో సీబీఐ విచారణకు హాజరైన కమలాపురం ఎమ్మెల్యే

04-09-2021 Sat 18:49
  • వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ
  • నేటితో 90వ రోజుకు చేరిన విచారణ
  • రవీంద్రనాథ్ రెడ్డిని విచారించిన సీబీఐ
  • రవీంద్రనాథ్ రెడ్డి సీఎం జగన్ కు మేనమామ 
Kamalapuram MLA Ravindranath Reddy attends CBI probe into Viveka murder case
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 90వ రోజుకు చేరింది. నేడు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఆయన ఈ కేసులో విచారణకు రావడం ఇదే తొలిసారి. రవీంద్రనాథ్ రెడ్డి సీఎం జగన్ మేనమామ అన్న విషయం తెలిసిందే.

కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో సీబీఐ రవీంద్రనాథ్ రెడ్డిని విచారించింది. అనేక అంశాలపై ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇటీవల వివేకా హత్యకేసులో సీబీఐ అనేకమందిని విచారిస్తూ కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కొందరిని పలుమార్లు విచారణకు పిలుస్తూ దర్యాప్తును ముందుకు తీసుకెళుతోంది.