Narendra Modi: ఈ నెలలో అమెరికా పర్యటనకు మోదీ?

Modi going to America next month
  • సెప్టెంబర్ 23, 24 తేదీల్లో అమెరికాకు వెళ్లే అవకాశం
  • బైడెన్ అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారి అమెరికాకు
  • 2019లో చివరిసారి అమెరికాకు వెళ్లిన మోదీ
ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల చివరి వారంలో ఆయన అమెరికాకు వెళ్లే అవకాశం ఉంది. జోబైడెన్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన అమెరికాకు వెళ్తుండటం ఇదే తొలిసారి. అయితే మోదీ పర్యటన గురించి అధికారికంగా ప్రకటన లేనప్పటికీ... సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ఆయన అమెరికాకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.

ఇక బైడెన్ తో మోదీ వ్యక్తిగతంగా సమావేశం కానుండడం ఇదే తొలిసారి. 2019లో మోదీ అమెరికాకు చివరిసారి వెళ్లారు. ఆ తర్వాత ఆయన తొలిసారి యూఎస్ కు వెళ్తున్నారు. ఇరు దేశాల మధ్య బంధాలను మరింత మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా మోదీ పర్యటన సాగుతుంది. తాలిబన్ల అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
Narendra Modi
BJP
USA
Joe Biden

More Telugu News