Telangana: జస్ట్​ మనం తినేదే ఆహారం కాదంటున్న కేటీఆర్​!

  • ఆసక్తికరమైన ట్వీట్ చేసిన తెలంగాణ మంత్రి
  • చూసేది, వినేది, చదివేది, చుట్టూ ఉండే జనాలు కూడా
  • మానసిక, శారీరక ఆరోగ్యంపై సూచనలు
KTR Compares Physical and Mental With Food

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. నిత్యం ఏదో ఒక విషయం మీద ట్వీట్లు చేస్తూనే ఉంటారు. సాయం చేయండంటూ వచ్చే అభ్యర్థనలకు స్పందిస్తారు. తనకు తోచినంత సాయం చేస్తుంటారు. అప్పుడప్పుడు హాస్యం కూడా పండిస్తుంటారు. తాజాగా శారీరక, మానసిక ఆరోగ్యం గురించి ఆయన ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

చుట్టూ ఉండే విషయాలు, మనం చేసే ప్రతి పని మనల్ని ప్రభావితం చేస్తుంటాయని, వాటి ప్రభావాన్ని తెలుసుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటామన్న అర్థం వచ్చేలా ఆయన ఆ పోస్ట్ పెట్టారు. ‘‘కేవలం మీరు తినేదే ఆహారం కాదు. మీరు చూసేది, వినేది, చదివేది, మీ చుట్టూ ఉండే జనాలు కూడా. కాబట్టి మీ శరీరాన్ని భావోద్వేగాలపరంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా ప్రభావానికి గురి చేసే విషయాల గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించండి’’ అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News