Andhra Pradesh: బెంగళూరులో దారుణం.. ఏపీ ఐటీ ఉద్యోగినిపై నైజీరియన్ల అత్యాచారం

Two Nigerians arrested in Rape case in Bengaluru
  • రెండు రోజుల క్రితం బాధితురాలి ఫిర్యాదు
  • అరెస్ట్ వివరాలు నైజీరియా రాయబార కార్యాలయానికి
  • వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగినిపై బెంగళూరులో అత్యాచారం జరిగింది.  బాధితురాలు రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని నైజీరియాకు చెందిన అబుజి ఉబాకా, టోనీలుగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, నిందితుల అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను నైజీరియా రాయబార కార్యాలయానికి పంపినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి వివరాలు వెల్లడించని పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆమెను ఆసుపత్రికి పంపినట్టు తెలిపారు.

Andhra Pradesh
West Bengal
Rape
Nigeria

More Telugu News