తాము టీడీపీతోనే ఉన్నామన్న మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరులు

04-09-2021 Sat 08:17
  • నిన్న చంద్రబాబును కలిసిన నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివనాథరెడ్డి
  • మద్దతుదారులతో కలిసి మరో నాలుగైదు రోజుల్లో మళ్లీ కలుస్తామన్న నేతలు
  • వైసీపీలో చేరుతారన్న ఊహాగానాలకు తెర
We are with Chandrababu Naidu said Adinarayana Reddy Brothers

తాము తెలుగుదేశం పార్టీతోనే ఉన్నామని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి సోదరులు స్పష్టం చేశారు. ఆదినారాయణరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నప్పటికీ తాము మాత్రం టీడీపీతోనే ఉన్నామని ఆయన సోదరుడు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, భూపేష్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న వారు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. తమ వర్గం నేతలతో నాలుగైదు రోజుల్లో మళ్లీ కలుస్తామని చంద్రబాబుకు తెలిపారు.

కాగా, శివనాథ్‌రెడ్డి, నారాయణరెడ్డి ఇద్దరూ వైసీపీలో చేరబోతున్నట్టు గతంలో ప్రచారం కూడా జరిగింది. తాజాగా, వీరు నిన్న చంద్రబాబును కలిసి టీడీపీతోనే ఉంటామని స్పష్టం చేయడంతో ఈ ఊహాగానాలకు తెరపడింది. తొలి నుంచి వైఎస్ కుటుంబానికి విధేయులుగా ఉంటూ వచ్చిన ఆదినారాయణరెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి విజయం సాధించి, ఆ తర్వాత టీడీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే.