తెలంగాణలో 6 వేలకు దిగువన కరోనా యాక్టివ్ కేసులు

03-09-2021 Fri 22:04
  • గత 24 గంటల్లో 71,829 కరోనా పరీక్షలు
  • 318 మందికి పాజిటివ్
  • కరోనా నుంచి కోలుకున్న 389 మంది
  • ఇద్దరి మృతి.. ఇంకా 5,736 మందికి చికిత్స
Corona active cases number declines in Telangana

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 389 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,59,007 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,49,391 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేలకు దిగువన నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,736 మంది చికిత్స పొందుతున్నారు.

గత 24 గంటల్లో 71,829 కరోనా పరీక్షలు నిర్వహించగా, 318 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. ఇద్దరు మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,880కి పెరిగింది.