Chandrababu: బద్వేల్ ఉప ఎన్నిక బరిలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

Chandrababu announced TDP candidate for Budvel by election
  • కొన్నినెలల కిందట వైసీపీ ఎమ్మెల్యే మృతి
  • ఖాళీ అయిన బద్వేలు అసెంబ్లీ స్థానం
  • అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు
  • టీడీపీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్
కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య గత వేసవిలో మరణించడం తెలిసిందే. ఆయన మృతితో బద్వేలు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేసే టీడీపీ అభ్యర్థిని పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఓబులాపురం రాజశేఖర్ బద్వేలు బరిలో దిగుతారని తెలిపారు. బద్వేలు ఉప ఎన్నికకు సన్నద్ధం కావాలని రాజశేఖర్ కు చంద్రబాబు నిర్దేశించారు. గత ఎన్నికల్లో రాజశేఖర్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.
Chandrababu
Obulapuram Rajasekhar
Budvel
By Election
Kadapa District

More Telugu News