EngvsInd: వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్‌గా జహీర్ ఖాన్ రికార్డు సమం చేసిన ఉమేశ్ యాదవ్

  • 42 టెస్టుల్లో ఈ ఫీట్ సాధించిన పేసర్
  • డేవిడ్ మలాన్ వికెట్‌తో జహీర్ రికార్డు సమం
  • జాబితాలో అగ్రస్థానంలో కపిల్ దేవ్
  • తొలి ఇన్నింగ్సులో ఇంగ్లండ్ 284-9
Umesh yadav Equeals Zaheer Khan record

ఇంగ్లండ్‌లో జరుగుతున్న టెస్టు సిరీస్ తొలి మూడు మ్యాచుల్లో ఆడే అవకాశం దక్కని పేసర్ ఉమేశ్ యాదవ్.. నాలుగో టెస్టులో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. తొలి ఇన్నింగ్సులో మూడు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఈ సిరీస్‌లో భీకర ఫామ్ ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ను అవుట్ చేసి భారత శిబిరంలో హుషారు నింపాడు.

ఈ క్రమంలోనే 150 వికెట్ల మైలురాయిని కూడా చేరుకున్నాడు. ఇదే సమయంలో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో మాజీ పేసర్ జహీర్ ఖాన్ రికార్డును సమం చేశాడు. వీళ్లిద్దరూ 49 టెస్టుల్లో 150 వికెట్లు పడగొట్టారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ (39 టెస్టులు) ఉండగా.. జవగల్ శ్రీనాథ్ (40 టెస్టులు), మహమద్ షమీ (42 టెస్టులు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

తొలి ఇన్నింగ్సులో తడబడి 62/5తో నిలిచిన ఇంగ్లండ్ జట్టును ఓ. పోప్(81) ఆదుకున్నాడు. అయితే అతన్ని చివర్లో శార్దూల్ ఠాకూర్ పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం క్రీజులో క్రిస్ వోక్స్ (37) ఆండర్సన్ (1) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమేష్ 3, బుమ్రా 2, జడేజా 2 వికెట్లు తీయగా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీసుకున్నారు.

More Telugu News