ParaOlympica: పారాలింపిక్స్‌లో తొలి ఆర్చరీ పతకం సాధించిన హర్విందర్

  • ఆర్చరీలో కాంస్య పతకం సాధించిన హర్విందర్ సింగ్
  • కొరియన్ క్రీడాకారుడిపై విజయం
  • పారాలింపిక్స్‌లో 13కు చేరిన భారత పతకాల సంఖ్య
Harvinder wins first archery medal for india

టోక్యో పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తున్నారు. తాజాగా హర్విందర్ సింగ్.. పురుషుల వ్యక్తిగత ఆర్చరీ రికర్వ్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. పారాలింపిక్స్‌లో ఆర్చరీ విభాగంలో భారత్‌కు దక్కిన తొలి పతకం ఇదే కావడం గమనార్హం. ఈ టోర్నీలో సెమీస్ చేరిన హర్విందర్.. అమెరికా అథ్లెట్ కెవిన్ మాదర్ చేతిలో 6-4 (25-28, 24-24, 25-25, 25-24, 24-26) తేడాతో ఓడిపోయాడు.

అనంతరం కొరియన్ క్రీడాకారుడు కిమ్‌తో జరిగిన కాంస్య పోరులో 6-5 (26-24, 27-29, 28-25, 25-25, 26-27) (10-8) తేడాతో విజయం సాధించి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా వుండగా, శుక్రవారం నాడు భారత హైజంపర్ ప్రవీణ్ కుమార్ రజత పతకం గెలుపొందగా, 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఎస్‌హెచ్ 1 పోటీల్లో అవనీ లేఖరా కాంస్య పతకం సాధించింది. ఈ విజయాలతో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 13కు చేరింది.

More Telugu News