పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ప్రియమణి!

  • చారిత్రక నేపథ్యంలో 'వీరమల్లు'
  • మలయాళ రీమేక్ గా 'భీమ్లా నాయక్'
  • లైన్లో హరీశ్ శంకర్ ప్రాజెక్టు
  • కీలకమైన పాత్రలో ప్రియమణి  
Pavan and Harish combo movie update

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమా రూపొందుతోంది. అలాగే సాగర్ చంద్ర దర్శకత్వంలో 'భీమ్లా నాయక్' సినిమా నిర్మితమవుతోంది. ఈ రెండు సినిమాలపై కూడా ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఆ తరువాత సినిమాను ఆయన హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నాడు. గతంలో ఈ కాంబినేషన్లో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ రావడం వలన, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది. ఇక ఒక కీలకమైన పాత్ర కోసం ప్రియమణిని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రియమణి ముఖ్యమైన పాత్రను పోషించిన 'నారప్ప' ఇటీవలే ప్రేక్షకులను పలకరించింది. ఇక రానా 'విరాటపర్వం'లోను ఆమె ఒక కీలకమైన పాత్రను చేసింది. అలాగే పవన్ సినిమాలోను ప్రాధాన్యత కలిగిన ఒక పాత్రను చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు.

More Telugu News