Siddharth Shukla: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సిద్ధార్థ్ శుక్లా పోస్ట్‌

Social media posts of Sidharh Shukla going viral
  • 40 ఏళ్ల వయసులోనే మృతి చెందిన సిద్ధార్థ్ శుక్లా
  • గుండెపోటుతో సిద్ధార్థ్ మృతి
  • ఫ్రంట్ లైన్ వర్కర్లు, పారాలింపిక్స్ విన్నర్లను ఉద్దేశిస్తూ పోస్టులు పెట్టిన సిద్ధార్థ్
బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ 40 ఏళ్ల వయసులోనే మరణించడంతో అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. హిందీ సీరియల్ 'బాలికా వధు' (తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు')తో ఆయన ప్రేక్షకులకు దగ్గరయ్యారు. హిందీ బిగ్ బాస్ సీజన్-13 విన్నర్ గా నిలిచారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన చివరి పోస్ట్ వైరల్ గా మారింది. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లకు శాల్యూట్ చేస్తూనే... టోక్యో పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఫ్రంట్ లైన్ వారియర్లు అందరికీ ధన్యవాదాలు అని తన పోస్ట్ లో తెలిపారు. ప్రాణాలు పణంగా పెడుతూ, నిరంతరాయంగా మీరు పని చేస్తారని కొనియాడారు. కుటుంబాలతో కలిసి ఉండలేని రోగులకు ఓదార్పునిస్తారని పేర్కొన్నారు. ముందు వరుసలో ఉండి పని చేయడం సామాన్యమైన విషయం కాదని... మీ కష్టాన్ని మేము అభినందిస్తున్నామని అన్నారు. పారాలింపిక్స్ లో మన క్రీడాకారులు మనం గర్వించేలా చేస్తున్నారని ట్వీట్ చేశారు. ఈ పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Siddharth Shukla
Bollywood
Social Media

More Telugu News