తోటి నటీనటులకు ‘మా’ అధ్యక్షుడు నరేశ్ వీకెండ్​ పార్టీ!

03-09-2021 Fri 11:58
  • రేపు సాయంత్రం 6 గంటలకు పార్టీ  
  • వాట్సాప్ లో నరేశ్ విజయకృష్ణ పేరుతో ఆహ్వానాలు
  • రంజుగా సాగుతున్న ‘మా’ సంస్థాగత ఎన్నికల పోరు
MAA President Naresh To Throw a Weekend Party To All His Cine Mates
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సంస్థాగత ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. తోటి నటీనటులకు పార్టీల మీద పార్టీలు ఇస్తున్నారు. మొన్నటికిమొన్న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా బిగ్ బాస్ లో పోటీ చేసే వారందరికీ ప్రకాశ్ రాజ్ తన ఆఫీసులో పార్టీ ఇస్తారంటూ ఓ సందేశం బయటకు వచ్చింది. తాజాగా ‘మా’ అధ్యక్షుడు నరేశ్ కూడా పార్టీ ఇస్తారంటూ ఓ మెసేజ్ హల్ చల్ చేస్తోంది.

పలువురు నటీ నటులకు హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్ దస్ పల్లాలో వీకెండ్ పార్టీ ఇస్తారంటూ నరేశ్ విజయకృష్ణ పేరుతో వాట్సాప్ మెసేజ్ లు వెళ్తున్నాయి. రేపు సాయంత్రం 6 గంటల నుంచి పార్టీ జరుగుతుందని ఆ మెసేజ్ లో పేర్కొన్నారు. అయితే, ‘మా’లోని సభ్యులను ఆకర్షించేందుకే ఇలా ఒకరి తర్వాత ఒకరు పార్టీలు ఇస్తున్నారన్న చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది.