Enforcement Directorate: డ్ర‌గ్స్ కేసు: విచార‌ణ‌కు వ‌చ్చిన‌ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్

Actor Rakul Preet Singh arrives at the office of Enforcement Directorate
  • డ్రగ్స్ కేసులో న‌గ‌దు లావాదేవీల‌పై ఈడీ విచార‌ణ‌
  • హైద‌రాబాద్‌లో కొన‌సాగుతోన్న‌ విచారణ
  • బ్యాంక్ ఖాతాల నుంచి జ‌రిగిన లావాదేవీలపై ప్ర‌శ్న‌లు
డ్రగ్స్ కేసులో న‌గ‌దు లావాదేవీల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైద‌రాబాద్‌లో విచారణ కొన‌సాగిస్తోన్న విష‌యం తెలిసిందే. టాలీవుడ్ ద‌ర్శ‌కుడు పూరీ జగన్నాథ్‏, న‌టి చార్మిని విచారించిన ఈడీ వారి నుంచి ప‌లు వివ‌రాలు రాబ‌ట్టింది.

ఇక ఈ రోజు విచార‌ణ‌లో భాగంగా హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌ ఈడీ కార్యాలయానికి చేరుకుంది. ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ఆమె చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాది, మేనేజర్‌ కూడా ఈడీ కార్యాల‌యానికి వ‌చ్చారు. ఆమె బ్యాంక్ ఖాతాల నుంచి జ‌రిగిన లావాదేవీలపై అధికారులు ప్ర‌శ్నించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్స్‌తో పాటు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ ఆమెకు స్ప‌ష్టం చేసింది.

రకుల్ ప్రీత్ ఈ నెల 6న విచార‌ణ‌కు రావాల‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందుగా నోటీసులు జారీ చేసింది. అయితే, ఆ రోజు త‌న‌కు షూటింగు ఉంద‌ని చెప్ప‌డంతో ఆమెను ఈ రోజే అధికారులు విచారిస్తున్నారు. డ్ర‌గ్స్‌ కేసులో కెల్విన్ ఇచ్చిన కీల‌క వివ‌రాల ఆధారంగా ఈ కేసులో ఈడీ విచార‌ణ కొనసాగిస్తోంది.
Enforcement Directorate
Rakul Preet Singh
Tollywood

More Telugu News