Akhil: 'ఏజెంట్' కి సారీ చెప్పేసిన తమన్!

Agent movie update
  • తమన్ చేతిలో భారీ ప్రాజెక్టులు
  • 'ఏజెంట్' మూవీకి చేయలేనన్న తమన్
  • రంగంలోకి దిగిన హిప్ హాప్ తమిజా
  • గతంలో 'ధృవ'తో దక్కిన గుర్తింపు
ఇటు యూత్ కి నచ్చే పాటలతో .. అటు మాస్ ఆడియన్స్ మెచ్చే పాటలతో తమన్ దూసుకుపోతున్నాడు. ఆయన ఒక సినిమాకి వర్క్ చేస్తున్నాడంటేనే ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక తాను పని చేస్తున్న సినిమా గురించిన అప్ డేట్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందించడం తమన్ ప్రత్యేకత.

ప్రస్తుతం ఆయన చేతిలో మూడు భారీ సినిమాలు ఉన్నాయి. చిరంజీవి .. చరణ్ .. మహేశ్ బాబు తాజా చిత్రాలకు ఆయనే సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అఖిల్ 'ఏజెంట్' సినిమాను చేయడానికి కూడా తమన్ ఒప్పుకున్నాడు. కానీ ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితుల కారణంగా, 'ఏజెంట్' సినిమాను చేయలేనని దర్శకుడు సురేందర్ రెడ్డికి చెప్పాడట. దాంతో ఆయన హిప్ హాప్ తమిజాను తీసుకున్నట్టుగా చెబుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ధృవ' భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
Akhil
Surendar Reddy
Thaman

More Telugu News