Hyderabad: హైదరాబాదులో భారీ వర్షం... అనేక ప్రాంతాలు జలమయం

Huge rain lashes Hyderabad
  • నగరాన్ని ముంచెత్తిన వాన
  • ఏకబిగిన గంట పాటు వర్షం
  • రోడ్లపై పొంగిపొర్లిన నీరు
  • ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు
  • పలు చోట్ల నిలిచిన విద్యుత్ సరఫరా

హైదరాబాదు నగరంలో భారీ వర్షం కురిసింది. ఉప్పల్, యూసుఫ్ గూడ, వెస్ట్ మారేడ్ పల్లి, మల్కాజిగిరి, మల్లాపూర్ బయోడైవర్సిటీ ప్రాంతం, మాదాపూర్, కాప్రా, సఫిల్ గూడ, ఖైరతాబాద్, మోతీనగర్, తిరుమలగిరి, కూకట్ పల్లి, షేక్ పేట తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి.

దాదాపు గంట సేపు ఏకబిగిన వర్షం కురియడంతో రోడ్లపై నీరు పొంగిపొర్లింది. దాంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News