పవర్ స్టార్ అంటే ఎందుకిష్టం?.. అభిమానులకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ప్రశ్న

02-09-2021 Thu 17:59
  • పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆండ్రూ ఫ్లెమింగ్
  • ఆయనంటే ఎందుకిష్టమో 10 పదాల్లో చెప్పాలని ఫ్యాన్స్‌కు క్వశ్చన్
  • వైరల్ అవుతున్న ట్వీట్
  • ఈరోజే పవన్ రెండు సినిమాల నుంచి రెండు గిఫ్టులు  
tell us in 10 words about why pawan is your hero asks British Dy High Commissioner

పవర్ స్టార్ పవర్ కల్యాణ్‌ అంటే ఎందుకిష్టం? ఈ ప్రశ్నకు అభిమానులు ఎలాంటి సమాధానాలు చెబుతారు? ఇదే అనుమానం హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్‌కు వచ్చింది. గురువారం పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఇదే ప్రశ్న అడిగారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలకు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ అయిన డాక్టర్ ఆండ్రూ ప్లెమింగ్.. తమ వైపు నుంచి పవన్ కల్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఆ వెంటనే ‘‘పవన్ కల్యాణ్ ఎందుకు మీ హీరో అయ్యాడు?’’ అనే ప్రశ్నకు పది పదాల్లో సమాధానం చెప్పాలని పవన్ అభిమానులను అడిగారు. ఇక అభిమానులు ఊరుకుంటారా? ఈ ట్వీట్‌కు రిప్లైల మీద రిప్లైలు ఇచ్చేస్తున్నారు. తమకు పవన్ అంటే ఎందుకు అభిమానమో చెబుతున్నారు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.

కాగా, పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న రెండు చిత్రాల నుంచి రెండు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు వచ్చిన సంగతి తెలిసిందే. ‘భీమ్లా నాయక్’ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది. ఆ తర్వాత కాసేపటికే రాధాకృష్ణ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ డేట్ రివీల్ చేశారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సర్‌ప్రైజ్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్.. ఆండ్రూ ఫ్లెమింగ్ ట్వీట్‌కు సమాధానాలిచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.