Nara Lokesh: తాలిబన్ల తాతల్లా తయారయ్యారు వైకాపాబన్లు: నారా లోకేశ్ ధ్వజం

YCPbans are more dangerous than Taliban says Lokesh
  • ఏలూరులో నాటు తుపాకులు తయారు చేసిన వ్యక్తి
  • వెంకటేశ్ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు
  • వైసీపీ పాలనపై టీడీపీ నేత ధ్వజం
ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న పాలనపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌లో కల్లోలం సృష్టించిన తాలిబన్ల కన్నా వైకాపాబన్లు ఘోరంగా తయారయ్యారని విమర్శించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన ఒక వ్యక్తి, తన ఇంట్లోనే నాటు తుపాకులు తయారుచేశాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వెంకటేశ్ సింగ్ అనే వ్యక్తి తన ఇంట్లోనే ఈ తుపాకులు తయారు చేసినట్లు గుర్తించారు.

అతని వద్ద నుంచి 12 రెడీ టు యూజ్ తుపాకులు, 6 ఇతర తుపాకులు, గన్ పౌడర్, 33 కేజీల చిన్న ఇనుప గుండ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపైనే నారా లోకేశ్ స్పందించారు. ‘‘తాలిబన్ల తాతల్లా తయారయ్యారు వైకాపాబన్లు. వాళ్లు (తాలిబన్లు) ఓపియం(నల్లమందు) ఒక్కటే పండిస్తారు. వైకాపాబన్ల పాలనలో వాలంటీర్ వాసు సారా తయారీతో మొదలై, నేడు తుపాకుల తయారీ ఉపాధి కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేశారు’’ అంటూ ధ్వజమెత్తారు.

గతంలో టీడీపీ హయాం గురించి కూడా ప్రస్తావించిన లోకేశ్.. ‘‘చంద్రబాబు నెలకొల్పిన మెడ్‌టెక్ జోన్‌లో కరోనా కిట్లు మేక్ ఇన్ ఆంధ్రా అయితే.. వైయస్ జగన్ విధ్వంసక పాలనలో ఫ్యాక్షన్ కిట్లు మేడ్ ఇన్ ఆంధ్ర’’ అంటూ సెటైర్ వేశారు. 
Nara Lokesh
YS Jagan
Chandrababu
Eluru
Telugudesam

More Telugu News