Pavan Kalyan: 'వీరమల్లు' విడుదల తేదీ ఖరారు.. అధికారిక ప్రకటన!

  • మొగల్ కాలంనాటి కథ 
  • వజ్రాల దొంగగా పవన్ 
  • కథానాయికగా నిధి అగర్వాల్ 
  • 2022 ఏప్రిల్ 29వ తేదీన విడుదల
Hari Hara Veera Mallu release date confirrmed

పవన్ కల్యాణ్ తన కెరియర్లోనే తొలిసారిగా చారిత్రక నేపథ్యంలోని సినిమాను చేస్తున్నాడు. 'హరి హర వీరమల్లు' టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. చారిత్రక చిత్రాలను తెరకెక్కించడంలో మంచి అనుభవం ఉన్న క్రిష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మొగల్ చక్రవర్తుల కాలంనాటి కథతో ఈ సినిమా నిర్మితమవుతోంది.

ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ సెట్లను నిర్మించారు. ఇందుకోసం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమాలో వజ్రాల దొంగ పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఇప్పటికే కొంతవరకు చిత్రీకరణ జరిపారు. త్వరలోనే మరో షెడ్యూల్ షూటింగును మొదలెట్టనున్నారు.

నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, వచ్చే వేసవిలో విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితం చెప్పారు. పవన్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ రోజున రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఒక పోస్టర్ ను వదిలారు. కీరవాణి సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

More Telugu News