Theenmar Mallanna: జైల్లో తీన్మార్ మల్లన్న నిరాహార దీక్ష చేయడం లేదు: జైలు సూపరింటెండెంట్

Theenmar Mallanna not doing hunger strike says jail superintendent
  • ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న మల్లన్న
  • పోలీసుల అక్రమ కేసులకు నిరసనగా నిరాహారదీక్షకు దిగినట్టు ప్రచారం 
  • స్పందించిన చంచల్ గూడ జైలు సూరింటెండెంట్ డి.శ్రీనివాస్ 
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న సత్తా చాటారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆయన కీలక పార్టీలకు ముచ్చెమటలు పట్టించారు. ఆ ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇదిలావుంచితే, ఒక వ్యక్తిని బెదిరించిన ఆరోపణల కేసులో ఆయన ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నారు. అయితే మంగళవారం నుంచి ఆయన జైల్లో నిరాహారదీక్ష చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

పోలీసులు పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా ఆయన నిరాహారదీక్ష చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంచల్ గూడ జైలు సూరింటెండెంట్ డి.శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు. తీన్నార్ మల్లన్న ఎలాంటి దీక్ష చేయడం లేదని స్పష్టం చేశారు.
Theenmar Mallanna
Chanchalguda Jail
Hunger Strike

More Telugu News