Tatvamasi: హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘తత్వమసి’

high voltage action thriller Tarvamasi
  • టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల
  • ముఖ్య పాత్రల్లో ప్రకాశ్ రాజ్, వరలక్ష్మీ శరత్ కుమార్ 
  • తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రం
కరోనా మహమ్మారి పెట్టిన ఇబ్బందుల నుంచి తెలుగు చిత్రపరిశ్రమ ఇప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలో పలు చిత్రాలు బాక్సాఫీసు దగ్గర సందడి చేస్తున్నాయి. చిన్న చిత్రాలకు కూడా ప్రేక్షకాదరణ దక్కుతోంది. అందుకే కొత్త దర్శకులు, నటులు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

 ఇలాంటి సమయంలో కొత్త దర్శకుడు రమణ గోపిశెట్టి రాసుకున్న కథ ‘తత్వమసి’. ఈ చిత్రం పోస్టర్‌ను గురువారం విడుదల చేస్తామని ఆయన ఇటీవల వెల్లడించారు. ఆయన చెప్పినట్లే విడుదలైన ‘తత్వమసి’ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రబృందం ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్, ఇషాన్, రాధాకృష్ణ తదితరులు నటిస్తున్నారు.

సినిమాకు రమణ గోపిశెట్టి దర్శకత్వం కూడా వహిస్తుండగా, శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. నల్లటి బ్యాక్‌గ్రౌండ్‌లో శ్రీచక్రం. దాని మధ్యలో ‘తత్వమసి’ అనే అక్షరాలపై ఎర్రని మరకలతో ఉన్న ఈ పోస్టర్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఆర్ఈఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.  
Tatvamasi
Prakash Raj
Varalakshmi Sarathkumar
Talking Movies
Tollywood

More Telugu News