Cow: గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ చట్టం చేయాలని అలహాబాద్ హైకోర్టు సూచన

Cow Protection Should Be Fundamental Right said allahabad High court
  • చంపే హక్కు కంటే జీవించే హక్కు ఉన్నతమైనది
  • గోమాంసాన్ని భుజించడం ప్రాథమిక హక్కు కానేకాదు
  • గోవు ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకున్న వారిలో ముస్లిం పాలకులు కూడా ఉన్నారన్న న్యాయస్థానం
  • గోవును దొంగిలించి శిరచ్ఛేదం చేసిన వ్యక్తికి బెయిలు నిరాకరణ 
హిందువులకు పూజనీయమైన గోవు విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆవును దొంగిలించి శిరచ్ఛేదం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జావేద్ అనే వ్యక్తికి బెయిలు నిరాకరించిన జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్‌తో కూడిన ధర్మాసనం.. చంపే హక్కు కంటే జీవించే హక్కు ఉన్నతమైనదని పేర్కొంది.

గోమాంసాన్ని భుజించడం హక్కు కానేకాదని తేల్చిచెప్పింది. నిందితుడిని బెయిలుపై విడుదల చేస్తే మళ్లీ అటువంటి నేరానికే పాల్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గోవు ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకున్న వారిలో ముస్లిం పాలకులు కూడా ఉన్నారని న్యాయస్థానం గుర్తు చేసింది.

సంస్కృతి, విశ్వాసాలు దెబ్బతినే దేశం బలహీనంగా మారుతుందని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ, దానికి హాని తలపెట్టే వారిని కఠినంగా శిక్షించేలా పార్లమెంటు ఓ చట్టం తీసుకురావాలని కేంద్రానికి సూచించింది. భారత సంస్కృతిలో గోవుకు విశిష్ట స్థానం ఉందని, ప్రాథమిక హక్కు అనేది గోమాంసం భుజించే వారికి ప్రత్యేకం ఏమీ కాదని తేల్చి చెప్పింది. గోవును పూజించే వారికి, దానిపై ఆర్థికంగా ఆధారపడే వారికీ ఇది ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Cow
Allahabad High Court
Cow meet

More Telugu News