Chandrababu: చంద్రబాబునాయుడు తొలిసారి సీఎంగా పదవి చేపట్టి 26 ఏళ్లు.. నేతల శుభాకాంక్షలు

26 years back Chandrababu first take oath as Chief Minister
  • 1 సెప్టెంబరు 1995న చంద్రబాబు తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం
  • కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేయించిన ఆచంట సునీత
  • కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా తొలిసారి పదవీ బాధ్యతలు చేపట్టి నిన్నటికి 26 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1 సెప్టెంబరు 1995న చంద్రబాబునాయుడు తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ అంగన్‌వాడీ వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆధ్వర్యంలో చంద్రబాబుతో మహిళలు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ అశోక్ బాబు, పట్టాభిరామ్, పిల్లి మాణిక్యరావు, సయ్యద్ రఫీ, ఏవీ రమణ, గోనుగుంట్ల కోటేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Chandrababu
Andhra Pradesh
Chief Minister
TDP

More Telugu News