Allu Arjun: ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రం ఇది: 'షేర్షా'పై అల్లు అర్జున్ ప్రశంసలు

Allu Arjun opines on Bollywood movie Shershaah
  • సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా జంటగా 'షేర్షా'
  • కెప్టెన్ విక్రమ్ బాత్రా ప్రస్థానం సినిమా
  • అమెజాన్ ప్రైమ్ లో విడుదల
  • వీక్షించిన అల్లు అర్జున్
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం 'షేర్షా'. పరమవీర చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ విక్రమ్ బాత్రా వీరోచిత ప్రస్థానం ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు విష్ణువర్ధన్ తెరకెక్కించారు. 'షేర్షా' అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాగా, బాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ కూడా ఈ సినిమాను వీక్షించారు. ఆపై సోషల్ మీడియాలో తన స్పందన వెలిబుచ్చారు.

"షేర్షా చిత్రబృందం మొత్తానికి అభినందనలు. హృదయాన్ని కదిలించే చిత్రం ఇది. సిద్ధార్థ్ మల్హోత్రా కెరీర్ లోనే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి. సినిమా మొత్తం అతడే ప్రధాన ఆకర్షణ. కియారా అద్వానీ, ఇతర నటీనటులు సైతం ఎంతో ప్రభావవంతంగా నటించారు. ఈ చిత్రకథపై ఎంతో నమ్మకంతో దర్శకుడు విష్ణువర్ధన్ అద్భుతంగా తెరకెక్కించారు. విష్ణువర్ధన్ గారూ... మీరు మమ్మల్ని గర్వించేలా చేశారు. కరణ్ జోహార్ సహా నిర్మాతలందరికీ అభినందనలు. ప్రతి ఒక్క భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రం ఇది. ఇంతటి బ్లాక్ బస్టర్ చిత్రం తీసుకువచ్చినందుకు అమెజాన్ ప్రైమ్ కు అభినందనలు తెలపాలి" అని పేర్కొన్నారు.
Allu Arjun
Shershaah
Siddarth Malhotra
Kiara Advani
Bollywood

More Telugu News