Nani: 'టక్ జగదీష్' నుంచి ట్రైలర్ రిలీజ్!

Tuck Jagadish trailer released
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ 
  • ఫ్యామిలీ ఎమోషన్స్ కి పెద్దపీట 
  • ప్రతినాయకుడిగా డేనియల్ బాలాజీ 
  • అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 10 నుంచి స్ట్రీమింగ్
నాని - శివ నిర్వాణ కాంబినేషన్లో 'టక్ జగదీష్' సినిమా రూపొందింది. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్లలో రాలేకపోయింది. సాహు గారపాటి - హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

దాదాపు అన్ని వైపుల నుంచి కథను కవర్ చేస్తూ ట్రైలర్ ను కట్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. తన ఊరి బాగు కోసం .. తన కుటుంబాన్ని నిలబెట్టడం కోసం నడుం బిగించే మంచి మనసున్న వాడిగా 'టక్ జగదీష్' కనిపిస్తున్నాడు.

నాని సరసన నాయికగా రీతూ వర్మ అలరించనుండగా, నాని అన్నయ్య పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు. ఇక ప్రతినాయకుడి పాత్రలో డేనియల్ బాలాజీ కనిపిస్తున్నాడు. గతంలో నాని - శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన 'నిన్నుకోరి' భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అంతకు మించిన హిట్ అవుతుందేమో చూడాలి.

Nani
Ritu Varma
Jagapathi Babu

More Telugu News