Sunil Yadav: వివేకా హత్య కేసు: నార్కో పరీక్షలకు అంగీకరించని సునీల్ యాదవ్

  • వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు
  • కీలక అనుమానితుడిగా సునీల్ యాదవ్
  • ఇటీవల సునీల్ యాదవ్ అరెస్ట్
  • నార్కో పరీక్షలు నిర్వహిస్తామన్న సీబీఐ
  • సమ్మతమేనా అని సునీల్ ను అడిగిన జడ్జి
Sunil Yadav denied to face narco test

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి నేడు జమ్మలమడుగు కోర్టులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు వర్చువల్ విధానంలో హాజరు పరిచారు. వివేకా హత్యకేసులో వాస్తవాలు రాబట్టేందుకు సునీల్ యాదవ్ కు నార్కో అనాలిసిస్ పరీక్ష నిర్వహిస్తామని, అందుకు అనుమతించాలని సీబీఐ జమ్మలమడుగు కోర్టును కోరింది.

ఈ నేపథ్యంలో, న్యాయమూర్తి స్పందిస్తూ, నార్కో పరీక్షలకు సమ్మతమేనా? అని సునీల్ యాదవ్ ను అడిగారు. నార్కో పరీక్షలకు తాను అంగీకరించబోనని సునీల్ యాదవ్ స్పష్టం చేశాడు. దాంతో సీబీఐ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. నార్కో పరీక్షలు జరపాలంటే న్యాయస్థానం అనుమతించడంతో పాటు, నార్కో పరీక్షలు చేయించుకునే వ్యక్తి అంగీకారం కూడా అవసరం. ఈ నిబంధన కారణంగానే నేడు సీబీఐకి నిరాశ ఎదురైంది.

More Telugu News