Panneerselvam: తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు భార్యావియోగం

Former CM Panneer Selvam wife Vijayalakshmi passes away
  • అనారోగ్యానికి గురైన విజయలక్ష్మి
  • గత కొన్నివారాలుగా చెన్నైలో చికిత్స 
  • ఇవాళ తీవ్రమైన గుండెపోటుతో మృతి
  • పన్నీర్ సెల్వంను ఓదార్చిన సీఎం స్టాలిన్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అర్ధాంగి విజయలక్ష్మి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయసు 63 సంవత్సరాలు. తీవ్ర గుండెపోటు కారణంగా విజయలక్ష్మి తుదిశ్వాస విడిచారు. పన్నీర్ సెల్వం, విజయలక్ష్మి దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇటీవల అనారోగ్యానికి గురైన విజయలక్ష్మి గత కొన్ని వారాలుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేడు ఆమె డిశ్చార్జి కావాల్సి ఉండగా, అంతలోనే ఛాతీలో నొప్పితో విలవిల్లాడిపోయారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో పన్నీర్ సెల్వం కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఆయనకు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్వయంగా వచ్చి పన్నీర్ సెల్వంను ఓదార్చారు. సీఎం రాకతో భావోద్వేగాలకు లోనైన పన్నీర్ సెల్వం భోరున విలపించారు. ఇక, సొంత పార్టీ నేతలు పళనిస్వామి, శశికళ తదితరులు పన్నీర్ సెల్వంను పరామర్శించారు.
Panneerselvam
Vijayalakshmi
Death
Tamilnadu

More Telugu News