Devineni Uma: పిచ్చి బ్రాండ్లు, నాసిరకం మందు అమ్ముతున్నారు: దేవినేని ఉమ

YSRCP Govt is selling cheap brands says Devineni Uma
  • మద్య నిషేధం అంటూ ఉత్తుత్తి మాటలు చెప్పారు
  • మంచి బ్రాండ్ల మద్యాన్ని మాయం చేశారు
  • పేదల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు
రాష్ట్రంలో మద్య నిషేధం విధిస్తామంటూ సీఎం జగన్ చెప్పిన మాటలు ఉత్తుత్తి మాటలేనని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. భారీ ఆదాయమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని... అందుకే మంచి బ్రాండ్ల మద్యాన్ని మాయం చేసి, పిచ్చి బ్రాండ్లు, నాసిరకం మద్యాన్ని అమ్ముతోందని మండిపడ్డారు. నాసిరకం మందుతో పేదల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోందని అన్నారు. పది రూపాయల మద్యాన్ని వంద రూపాయలకు అమ్ముతూ పేదల జేబులు ఖాళీ చేస్తోందని విమర్శించారు.
 
టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వినుకొండ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, స్థానిక చట్ట సభల్లో బీసీలకు అవకాశం ఇచ్చింది టీడీపీనే అని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలను బిచ్చగాళ్లను చేశారని అన్నారు. కులవృత్తులను నాశనం చేశారని మండిపడ్డారు. బీసీ కులాల కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారిని వైసీపీకి పాలేరులుగా మార్చేసుకుందని విమర్శించారు.
Devineni Uma
Telugudesam
Jagan
YSRCP
Liquor

More Telugu News