Sangam Dairy: ఏపీ ప్రభుత్వం అప్పీలు తిరస్కరణ.. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని హైకోర్టు తీర్పు

AP HC orders AP Govt not to takeover Sangam Dairy
  • రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ ను కొట్టేసిన హైకోర్టు
  • ఇంప్లీడ్ పిటిషన్లు కూడా కొట్టివేత
  • సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్
గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ అంశంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ ను తిరస్కరించింది. ఈ అంశంపై దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్లను కూడా కొట్టేసింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయానికి సంబంధించి గతంలోనే హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని తీర్పును వెలువరించింది.

అయితే, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ... వైసీపీ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది. దీంతో, దీనిపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ ను తిరస్కరించింది.
Sangam Dairy
AP High Court
AP Govt

More Telugu News