'భీమ్లా నాయక్' ఫస్టు సింగిల్ గురించి తమన్!

01-09-2021 Wed 10:50
  • రేపు పవన్ పుట్టినరోజు
  • 'భీమ్లా నాయక్' నుంచి ఫస్టు సింగిల్
  • సంగీత దర్శకుడిగా తమన్
  • జనవరి 12వ తేదీన విడుదల
Bheemla Nayak first single will release at September 2nd

ఇప్పుడు ఎక్కడ చూసినా మూవీ లవర్స్ అంతా పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' గురించే మాట్లాడుకుంటున్నారు. రేపు పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో ఫస్టు సింగిల్ ను వదలనున్నట్టుగా ముందుగానే చెప్పారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. తన సినిమాలకి సంబంధించిన అప్ డేట్స్ ను అందించడంలో తమన్ ఎప్పుడూ ముందుంటాడు.

అలాగే ఆయన 'భీమ్లా నాయక్' అప్డేట్స్ ను అందించే విషయంలో ఉత్సాహంతో ఉంటున్నాడు. ఈ సినిమా నుంచి రేపు రానున్న ఫస్టు సింగిల్ ఒక రేంజ్ లో ఉంటుందనీ, ఈ సాంగ్ చేసే సందడి మామూలుగా ఉండదని చెప్పుకొచ్చాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చిన ఆ సాంగ్ యూత్ ను ఊపేయడం ఖాయమని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండనుంది. మరో ప్రధానమైన పాత్రలో రానా నటిస్తుండగా, కథానాయికల పాత్రలలో నిత్యామీనన్ .. ఐశ్వర్య రాజేశ్ కనిపించనున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.