Jagga Reddy: వైయస్ విజయమ్మ తెలంగాణలో కొత్త నాటకాలకు తెరతీశారు: జగ్గారెడ్డి

YS Vijayamma started new drama in Telangana says Jagga Reddy
  • రాజశేఖరరెడ్డితో మాకున్న అనుబంధం వేరు
  • షర్మిల విషయంలో మాకు అభ్యంతరాలు లేవు
  • తెలంగాణకు విజయమ్మ ఏమవుతారు?
ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విజయమ్మ సరికొత్త నాటకాలకు తెరలేపుతున్నారని ఆయన ఆరోపించారు. వైయస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో కొడుకు జగన్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టి, బీజేపీతో కలిసి నడుస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కూతురు షర్మిలతో కలిసి ఆమె రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

వైయస్ రాజశేఖరరెడ్డితో తమకున్న అనుబంధం వేరని... ఇదే సమయంలో రాజకీయాలు కూడా వేరని ఆయన అన్నారు. షర్మిల తెలంగాణ కోడలేనని... ఈ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని... అయితే, తెలంగాణకు విజయమ్మ ఏమవుతారని ప్రశ్నించారు. విజయమ్మ రాజకీయాలు ఇక్కడ నడవవని అన్నారు. తెలంగాణలో గంజాయి మత్తులో ఉన్న యువతను బీజేపీ, ఎంఐఎం మత రాజకీయాలకు వాడుకుంటున్నాయని మండిపడ్డారు.
Jagga Reddy
Congress
YS Sharmila
YS Vijayamma

More Telugu News