Santhosh Shobhan: 'ప్రేమ్ కుమార్' నుంచి గ్లింప్స్ రిలీజ్!

  • 'ప్రేమ్ కుమార్'గా సంతోష్ శోభన్ 
  • అభిషేక్ మహర్షి దర్శకత్వం
  • కథానాయికగా రాశి సింగ్
  • పెళ్లి చుట్టూ తిరిగే కథ 
Prem Kumar movie Glimpse released

'ఏక్ మినీ కథ' సినిమాతో సంతోష్ శోభన్ కి మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత ఆయన వరుస సినిమాలను ఒప్పేసుకున్నాడు. అయితే ఆయన తన కథల్లో కామెడీ పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నాడు. అలా వినోదమే ప్రధానంగా నిర్మితమైన సినిమానే 'ప్రేమ్ కుమార్'.

అభిషేక్ మహర్షి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్టులుక్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. మంగళ సూత్రాలు రెడీగా పట్టుకుని, తనకి తగిన వధువు కోసం భూతద్దం పట్టుకుని గాలించే పెళ్లి కొడుకు లుక్ తో సంతోష్ శోభన్ అందరిచూపు ఈ సినిమా వైపుకు తిప్పేశాడు.

తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను వదిలారు. తన మనసుకు నచ్చే అమ్మాయి కోసం పెళ్లికొడుకుగా హీరో పడే పాట్లను కామెడీగా చూపించారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా కూడా చెప్పేశారు. ఈ సినిమాలో కథానాయికగా రాశి సింగ్ సందడి చేయనుంది.

More Telugu News